తెలంగాణ

telangana

ETV Bharat / city

Bandi Sanjay on Teacher Posts: 'రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్​ పోస్టులు భర్తీ చేయాలి' - బండి సంజయ్

తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఈడీ, డీఈడీ, పండిట్‌ శిక్షణ, పీఈటీ పూర్తి చేసిన 7 లక్షల మంది నిరుద్యోగులు నిరాశతో ఉన్నారని అన్నారు.

Bandi Sanjay on Teacher Posts
Bandi Sanjay on Teacher Posts

By

Published : Jan 24, 2022, 3:02 PM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 44వేల టీచర్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. విద్యారంగంలో తెలంగాణ 18వ స్థానంలో ఉండడమే దీనికి నిదర్శనమని విమర్శించారు.

బీఈడీ, డీఈడీ, పండిట్‌ శిక్షణ, పీఈటీ పూర్తి చేసిన 7 లక్షల మంది నిరుద్యోగులు నిరాశతో ఉన్నారని బండి సంజయ్ వాపోయారు. టీచర్లు లేక పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీ ఎయిడెడ్‌ సంస్థల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. యుద్ద ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేసి విద్యారంగాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details