తాము లేవనెత్తిన అంశాలపై నాగార్జునసాగర్ పర్యటనకు ముందే.. సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనుల హక్కులను సీఎం కాలరాస్తున్నారని విమర్శించారు. వారికి సాగర్ పర్యటనకు ముందే క్షమాపణలు చెప్పాలన్నారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని గుర్రంబోడు తండాలో ఆక్రమించుకున్న భూమిపై స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. నాగార్జునసాగర్ ముంపునకు గురైన రైతులకు భూములు కేటాయిస్తే.. ఆ భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ డాక్యుమెంట్లు తయారుచేసి గిరిజనుల నుంచి లాక్కున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.