తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం ఘటనపై కేంద్ర విద్యుత్​శాఖ మంత్రికి బండి సంజయ్​ ఫిర్యాదు - బండి సంజయ్

శ్రీశైలం ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ద్వారా విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్లు ఆయన చెప్పారు.

bandi sanjay complaint to union electricity minister on srisailam incident
శ్రీశైలం ఘటనపై కేంద్ర విద్యుత్​శాఖ మంత్రికి బండి సంజయ్​ ఫిర్యాదు

By

Published : Aug 28, 2020, 7:58 PM IST

శ్రీశైలం ప్రమాద ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్​కు వివరించారు. సంస్థ భవిష్యత్తు కోసం ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్రమంత్రి ఆర్​కే సింగ్​ విచారం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

పవర్ ప్రాజెక్టుల లోపాలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ద్వారా విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్లు బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హైడల్ పవర్ ప్రాజెక్టులను ఆడిట్ చేసి భద్రతా లోపాలపై విచారణ జరిపిస్తామని ఆర్​కే సింగ్ చెప్పినట్లు బండి సంజయ్ తెలిపారు.

ఇవీ చూడండి: 'కరోనాపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ విరాళం​'

ABOUT THE AUTHOR

...view details