Bandi Sanjay Comments on KCR: 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెనుప్రమాదమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ తుగ్లక్ చర్యలకు ఇదే నిదర్శనమని తెలిపారు. స్థానిక ఉద్యోగులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఉద్యోగుల్లో చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Bandi Sanjay Comments on KCR : 'కేసీఆర్ తుగ్లక్ చర్యలతో ఉద్యోగులకు ప్రమాదం' - తెలంగాణ న్యూస్
Bandi Sanjay Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రంలోని ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. 317 ఉత్తర్వులతో స్థానిక ఉద్యోగులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.
![Bandi Sanjay Comments on KCR : 'కేసీఆర్ తుగ్లక్ చర్యలతో ఉద్యోగులకు ప్రమాదం' Bandi Sanjay Comments on KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13890791-thumbnail-3x2-a.jpg)
Bandi Sanjay on Employees Transfer : ఉద్యోగులను ఇబ్బందిపెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత సమస్యను దారిమళ్లించేందుకు తెరపైకి కొత్త సమస్య తీసుకువచ్చారని ఆరోపించారు. జీవో 317తో ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని అన్నారు. జీవో 317 అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
ఇవీ చదవండి :