Bandi Sanjay Fires on CM KCR: దిల్లీ లిక్కర్ స్కామ్ విషయంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేక వస్తోందని పేర్కొన్నారు. సీఎం కుటుంబం స్వయంగా తమ పరువు తామే తీసుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పాదయాత్ర మొదలుపెడితే తాను ప్రజాసంగ్రామ యాత్ర ఆపేస్తానని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని వ్యాఖ్యానించారు.
వరి వేస్తే ఉరి అన్న సీఎం.. కామెంట్స్‌తో రైతులను ఇబ్బంది పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. రుణమాఫీ కోసం 34 లక్షల రైతు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో క్రైమ్ రేట్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలించిందని ఆరోపించారు. మోదీకి, కేసీఆర్‌కు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.