తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేంద్రమంత్రి నూకలను తినమన్నారంటూ తెరాస దుష్ప్రచారం చేస్తోంది' - బండి సంజయ్ వార్తలు

Bandi Sanjay Fires on KCR: మంత్రులను కేసీఆర్‌ దిల్లీకి ఎందుకు పంపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. సమస్య మరింత పెంచేలా కేసీఆర్‌ వైఖరి ఉందని విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై బురద జల్లుతున్నారని అన్నారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Mar 26, 2022, 8:19 PM IST

Updated : Mar 26, 2022, 9:24 PM IST

Bandi Sanjay Fires on KCR: ధాన్యం సేకరించని సీఎం కేసీఆర్​కు ఓట్లు, సీట్లు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనే హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సమస్య పరిష్కారం కావాలో కొట్లాట కావాలో కేసీఆర్ చెప్పాలని తెలిపారు. కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ అవమానిస్తే.. రోషం, పౌరుషం లేకుండా మంత్రులు ఎందుకు ఊరుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులు తరిమికొడతారన్న భయంతో నెపాన్ని కేసీఆర్ కేంద్రంపై వేస్తున్నారని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఇతర రాష్ట్రాలో లేని ధాన్యం సమస్య.. తెలంగాణలో మాత్రమే ఎందుకు సృష్టిస్తున్నారని బండి సంజయ్​ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపును పక్కదారి పట్టించేందుకే.. మంత్రుల ఢిల్లీ పర్యటన అని చెప్పారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఏం జరిగిందో అందరకీ తెలుసని అన్నారు. ఫాంహౌస్​లో వరి పండిస్తున్నారో.. గంజాయి పండిస్తున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాంహౌస్​లో పండిస్తోన్న వరి ఎక్కడ అమ్ముతారని నిలదీశారు.

'కొనుగోలు కేంద్రాలను ఎత్తేసే హక్కు ముఖ్యమంత్రికి లేదు. మంత్రులు, తెరాస నేతల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ము కేసీఆర్​కు ఉందా? రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి కేంద్రం నిధులు దోచుకుంటున్నారు. తాను చేసిన పొరపాటును ఒప్పుకుని కేసీఆర్ కేంద్రంతో మాట్లాడాలి. ఏడేళ్లుగా లేని సమస్యను కేసీఆర్ సృష్టిస్తున్నారు. తెలంగాణ రైతుల ఇబ్బందులకు కారణం కేసీఆర్ నియంతృత్వమే.' - బండి సంజయ్​

సర్పంచ్​లతో తీర్మానాలు చేయించే అధికారం కలెక్టర్లకు లేదని బండి సంజయ్ అన్నారు. ఫ్రభుత్వాలు శాశ్వతం కాదని.. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉందని కలెక్టర్లు గుర్తించుకోవాలని హితవు పలికారు. సింగరేణి గురించి మాట్లాడే అర్హత కేసీఆర్, తెరాసకు లేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అవాస్తవమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :ధరలు పెంచి మళ్లీ వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు : రేవంత్‌ రెడ్డి

Last Updated : Mar 26, 2022, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details