తెలంగాణ

telangana

ETV Bharat / city

Bandi Sanjay Petition: రిమాండ్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్​ - Bandi Sanjay arrested

Bandi Sanjay Petition: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తన రిమాండ్​ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. తనను వెంటనే విడుదల చేసేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.

Bandi Sanjay approached telangana High Court seeking revocation of his remand
Bandi Sanjay approached telangana High Court seeking revocation of his remand

By

Published : Jan 5, 2022, 6:00 AM IST

Bandi Sanjay Petition: తన రిమాండ్​ను రద్దు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. కరీంనగర్ కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్​ను కొట్టివేయాలని పిటిషన్​లో ఆయన కోరారు. తనను వెంటనే విడుదల చేసేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని బండి సంజయ్ కోరారు. ఐపీసీ 333 సెక్షన్​ను తర్వాత జత చేశారని.. దాన్ని కొట్టివేయాలని కోరారు.

అత్యవసరంగా లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టును మంగళవారం(జనవరి 4న) ​కోరారు. బండి సంజయ్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసులు తన పరిధిలోకి రావాని... జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్​కు పంపించాలని రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details