తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖుల ఆకాంక్ష - bandaru dattatreya about kcr's health

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు.

cm kcr, cm kcr tested covid positive
సీఎం కేసీఆర్, కేసీఆర్​కు కరోనా

By

Published : Apr 20, 2021, 12:42 PM IST

Updated : Apr 20, 2021, 2:23 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు కోరుకున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా భగవంతుడు ఆయణ్ని ఆశీర్వదించాలని వేడుకున్నట్లు చెప్పారు.

మరోవైపు కేసీఆర్ త్వరగా ఆరోగ్యంతో తిరిగిరావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.

మరోవైపు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు కోరుకున్నారు. కేసీఆర్ పేరు మీద అర్చన‌లు చేయాల‌ని పూజారులను కోరారు.

హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తార్నాకలోని లక్ష్మీగణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు.

ఈనెల 19న సీఎం కేసీఆర్​కు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్‌‌ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నందున.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ తన ఫాంహౌస్​లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Last Updated : Apr 20, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details