Banda Prakash resigned: రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాశ్ రాజీనామా - mp banda prakash resign

14:23 December 02
Banda Prakash resigned: రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాశ్ రాజీనామా
Banda Prakash resigned: రాజ్యసభ సభ్యత్వానికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామాను బండ ప్రకాశ్ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు.
వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించిన బండప్రకాశ్.. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఉన్నారు. వరంగల్ పురపాలక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడైన ఆయన 2017లో తెరాసలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018 మార్చి 23న తెరాస తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఇదీ చూడండి: