తెలంగాణ

telangana

ETV Bharat / city

టీవీ, రేడియోల్లో మహిళల వాయిస్‌పై తాలిబన్ల నిషేధం - తాలిబన్లు

కాందహార్‌లో వున్న టీవీ, రేడియో ఛానెళ్లలో మహిళల వాయిస్‌పై నిషేధం విధిస్తూ.. తాలిబన్లు సంబంధిత ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తాలిబన్లు అఫ్గాన్​ను ఆక్రమించినప్పుడే చాలా ఛానెళ్లు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించాయి.

ban on female voices
ban on female voices

By

Published : Aug 29, 2021, 6:50 PM IST

అఫ్గానిస్థాన్​లో షరియా చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు తాలిబన్లు. టీవీ, రేడియోల్లో మహిళల వాయిస్‌పై, సంగీతంపై నిషేధం విధించారు. కాందహార్‌లో వున్న టీవీ, రేడియో ఛానెళ్లకు ఇప్పటికే సంబంధిత ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

తాలిబన్లు అఫ్గాన్​ను ఆక్రమించినప్పుడే చాలా ఛానెల్స్ మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇప్పటికే దేశంలో ఉమ్మడి విద్యా విధానం రద్దు చేశారు తాలిబన్లు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తున్నట్లు తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు.

అందరికీ క్షమాభిక్ష పెట్టామని.. ఎవరి పనులు వారు స్వేచ్ఛగా చేసుకోవచ్చని... మహిళలు సైతం ఉద్యోగాలు చేసుకోవచ్చని తొలుత ప్రకటించిన తాలిబన్లు.. రోజులు గడిచే కొద్దీ షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. తాలిబన్లు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకి రావొద్దని, వారంతా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే మహిళా ఉద్యోగులు బయటకు రావాలని తాలిబన్లు నిబంధనలు విధించారు.

ఇదీ చూడండి:ISIS khorasan: 'ఐసిస్​-కే'కు రూ.వేల కోట్ల నిధులు ఎలా వచ్చాయ్​?

ABOUT THE AUTHOR

...view details