చీపుర్లకు చేతిపిడిగా ప్లాస్టిక్‌కు బదులు ఈశాన్యరాష్ట్రాల్లో విరివిగా దొరికే వెదురును ఉపయోగించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి వడ్డారపు ప్రసాదరావు. స్థానికంగా ఉండే గడ్డితోపాటు, విస్తృతంగా లభించే వెదురును ఉపయోగించుకొని గిరిజనులతో కొత్త తరహా పర్యావరణహిత చీపుర్ల తయారీని ‘వన్‌ధన్ వికాస్’ కార్యక్రమం కింద ప్రసాదరావు ప్రోత్సహిస్తున్నారు.
ప్లాస్టిక్ భూతాన్ని ఊడ్చేయాలని చీపుర్లకు వెదురు పిడి - చీపుర్లకు వెదురు పిడి
గిరిజనులకు ఉపాధి కల్పిస్తూనే ‘ప్లాస్టిక్ భూతం’పై పోరు సాగిస్తున్నారు 2010 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి వడ్డారపు ప్రసాదరావు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్లకి చెందిన ఆయన ప్రస్తుతం త్రిపుర రిహాబిలిటేషన్ ప్లాంటేషన్ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు. ఏటా వేల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేసే బృహత్తర కార్యక్రమానికి ప్రసాదరావు శ్రీకారం చుట్టారు.

ప్లాస్టిక్ భూతాన్ని ఊడ్చేయాలని చీపుర్లకు వెదురు పిడి
ఏటా 4లక్షల చీపుర్లు తయారు చేయించి తక్కువ ధరకే వినియోగదారులకు అందజేసే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. దేశంలోని 20 కోట్ల కుటుంబాలు వాడుతున్న చీపుర్లకు పిడి కోసం దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వినియోగిస్తున్నట్లు అంచనా. ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే వెదురు ప్లాస్టిక్‌లాగానే తేలికగా ఉండి.. చీపురు పిడిగా ఉపయోగించడానికి అనువుగా ఉంటుందని ప్రసాదరావు తెలిపారు.