తెరాస ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. నిస్వార్థంగా పనిచేస్తున్న వారిపై నిరాధార ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని శంభీపూర్ రాజు సవాల్ విసిరారు.
"ఆ వ్యాఖ్యలను సోమారపు విజ్ఞతకే వదిలేస్తున్నా" - balka suman about somarapu satyanarayana resignation
గత ఎన్నికల్లో తన ఓటమికి మాజీ ఎంపీ, ముఖ్య నాయకులే కారణమన్న సోమారపు సత్యనారాయణ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. అతనిపై ఎటువంటి దురభిప్రాయం లేదని ఆయన వ్యాఖ్యలను తన విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
balka suman about somarapu satyanarayana resignation
TAGGED:
SADARAM_CAMP