క్యాన్సర్ బారిన పడిన పేదల ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఎన్టీఆర్.. ముందు చూపుతో బసవతారకం ఆస్పత్రిని నెలకొల్పారని ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన 61వ జన్మదిన వేడుకల్లో బాలయ్య పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో వేడుకలు అత్యంత సాధారణంగా నిర్వహించారు.
'Balayya: బవసతారకం ఆస్పత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు - బాలకృష్ణ జన్మదిన వేడుకలు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హీరో బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలయ్య పాల్గొన్నారు. తన జన్మదినం రోజున అభిమానులు, ఆస్పత్రి సిబ్బంది చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు.
!['Balayya: బవసతారకం ఆస్పత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు balayya babu birthday celebrations in basavatarakam hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12081348-183-12081348-1623309602156.jpg)
balayya babu birthday celebrations in basavatarakam hospital
బవసతారకం ఆస్పత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు
ఆస్పత్రి ప్రాణంగణంలోని ఎన్టీఆర్, బసవతారకం దంపతుల విగ్రహాలకు బాలయ్య పూల మాలలు వేశారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పళ్లు అందించారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని బాలకృష్ణ సూచించారు. అయితే టీకా వేసుకున్న తర్వాత కూడా తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం రోజున అభిమానులు, ఆస్పత్రి సిబ్బంది చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు.