తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు కొలువుదీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు బారులుతీరారు.

By

Published : Sep 27, 2022, 10:32 AM IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.. రెండోరోజైన నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి దర్శనానికి ప్రత్యేక సమయాన్ని ఆలయ కమిటీ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details