డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు’’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బాలకృష్ణ పంచ్ డైలాగులు.. ప్రజలు మిమ్మల్ని మార్చేస్తారంటూ.. - ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లేటెస్ట్ అప్డేట్
![ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బాలకృష్ణ పంచ్ డైలాగులు.. ప్రజలు మిమ్మల్ని మార్చేస్తారంటూ.. ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బాలకృష్ణ పంచ్ డైలాగులు.. ప్రజలు మిమ్మల్ని మార్చేస్తారంటూ..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16459364-753-16459364-1663996817248.jpg)
ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బాలకృష్ణ పంచ్ డైలాగులు.. ప్రజలు మిమ్మల్ని మార్చేస్తారంటూ..
10:34 September 24
ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బాలకృష్ణ ఆగ్రహం
Last Updated : Sep 24, 2022, 11:25 AM IST