హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రిలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం భారత స్వాతంత్య్రమని అన్నారు. గాంధీ, నెహ్రూ, బోస్, భగత్ సింగ్ వంటి మహనీయులు భారత స్వాతంత్య్రం కోసం పోరాడారని అన్నారు. కేసీఆర్ సైతం తెలంగాణ సాధన కోసం అంతే కృషి చేసినట్టు పేర్కొన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నాయని అభిప్రాయపడిన బాలయ్య.... ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
స్వరాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు: బాలకృష్ణ - నందమూరి బాలకృష్ణ తాజా వార్తలు
తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
బాలకృష్ణ