తెలంగాణ

telangana

ETV Bharat / city

కోఠిలో భజరంగ్​ దళ్​ కార్యకర్తల ఆందోళన - hyderabad

హైదరాబాద్​ కోఠిలోని ఆంధ్రబ్యాంక్​ కూడలిలో భజరంగ్​ దళ్​ నాయకులు ఆందోళన చేశారు. పశ్చిమ బంగలో హిందువులకు రక్షణ కరువైందని.... అక్రమ కేసులు పెడుతూ జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు.

కోఠిలో భజరంగ్​ దళ్​ కార్యకర్తల ఆందోళన

By

Published : Oct 12, 2019, 7:20 PM IST

పశ్చిమ బంగలో హిందువులకు రక్షణ కరువైందని భజరంగ్ దళ్ నాయకులు ఆరోపించారు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా... భజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్ కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ కూడలిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయన్నారు. హిందుత్వం గురించి మాట్లాడితే అక్రమంగా కేసులు పెడుతూ... జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. హిందుత్వం గురించి ప్రచారం చేస్తున్న భజరంగ్ దళ్ కార్యకర్త బంధు ప్రకాష్ , అతని కుటుంబ సభ్యులు నలుగురిని ప్రభుత్వం హత్య చేయించిందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని పశ్చిమ బంగలో హిందువులకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

కోఠిలో భజరంగ్​ దళ్​ కార్యకర్తల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details