తెలంగాణ

telangana

By

Published : Aug 19, 2020, 7:46 PM IST

ETV Bharat / city

ఏపీ: జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో జైల్లో ఉన్న ఆయనకు అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో గుండె శస్త్ర చికిత్స జరిగిందని... తాజాగా కరోనా సోకిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన కోర్టు... బెయిల్ మంజూరు చేసింది.

ఏపీ: జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు
ఏపీ: జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.ఇటీవల కడప జైలులో ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గతంలో తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని.. అత్యవసర పరిస్థితిని గుర్తించి బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆయన బెయిల్‌పై విడుదల కానున్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డిలపై అక్రమ వాహనాల కేసులో గతంలో అనంతపురం పోలీసులు అరెస్టు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. సుమారు 55 రోజులపాటు వాళ్లిద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అనంతరం పది రోజుల క్రితం వారికి బెయిల్ మంజూరైంది. బెయిల్‌పై విడుదలైన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ తాడిపత్రి సీఐ అడ్డగించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అతన్ని దూషించారు. దీంతో జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మళ్లీ అరెస్ట్‌ చేశారు. రిమాండ్ నిమిత్తం వారం క్రితం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా వైరస్‌ సోకడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ABOUT THE AUTHOR

...view details