బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. పీవీ సింధుకు క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, క్రీడా సాధికారత సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, చాముండీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సింధు గచ్చిబౌలీలోని గోపిచంద్ అకాడమీకి వెళ్లారు. పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు ప్రముఖులు రావడం వల్ల పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు.
బేగంపేటలో పీవీ సింధుకు ఘన స్వాగతం - badminton player pv sindhu
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పీవీ సింధు, కోచ్ గోపిచంద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సింధుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు.
pv sindhu
Last Updated : Aug 27, 2019, 11:22 PM IST