తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న గోపిచంద్ - TTD latest news
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న గోపిచంద్
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలోని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.