తెలంగాణ

telangana

ETV Bharat / city

వైద్య శాస్త్రంలో ఇదో మిరాకిల్‌..! - miracle in medical science

వావ్‌... వైద్యశాస్త్రంలో ఇదో మిరాకిల్‌..! సినిమాల్లో వ్యంగ్యంగా చెప్పే ఈ డైలాగ్‌ ఇప్పుడు నిజమైంది. కరోనా భయాందోళనల వేళ ఏపీలోని చిత్తూరులో ఒకింత వింత జరిగింది. కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఎటునుంచి దాడిచేస్తుందోనని అంతా భయపడుతుంటే ఏడాదిన్నర వయసున్న బాబు 17 రోజులపాటు కరోనా సోకిన తల్లి వద్దే ఉండి సురక్షితంగా బయటపడ్డాడు.

boy didnot get corona even his mother get corona
వైద్య శాస్త్రంలో ఇదో మిరాకిల్‌..!

By

Published : Apr 26, 2020, 12:43 PM IST

కరోనా వైరస్‌... పెద్ద, చిన్న... పేద, ధనిక అనే తేడాలేకుండా దాడి చేస్తోంది. ఈ భయంకర వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించాలని అందరూ సూచిస్తున్నారు. అందుకే ఇల్లు కదలొద్దని చెబుతున్నారు. ఇక వైరస్‌ ప్రభావిత ప్రాంతాలైన రెడ్‌జోన్లవైపు కనీసం తొంగి చూడొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కాదని వెళ్తే వైరస్‌ సంక్రమిస్తుందని చెప్తున్నారు. కానీ చిత్తూరు జిల్లాలో ఏడాది వయసున్నబాబు ఒకట్రెండు కాదు ఏకంగా 17 రోజులు కరోనా వైరస్‌ చట్రంలోనే ఉంటూ సురక్షితంగా బయటపడ్డాడు.

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఓ వ్యక్తి దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లివచ్చాడు. అ తర్వాత ఆయన కుటుంబంలో ఓ మహిళకు వైరస్‌ వ్యాపించింది. ఆమెకు ఓ ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. వ్యాధిగ్రస్తురాలైన ఆ తల్లిని అధికారులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. చిన్నారి ఆలనాపాలన చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాక... తప్పనిసరి పరిస్థితుల్లో బాబునూ తల్లి వద్దే ఉంచారు.

ఎప్పటికప్పుడు ఆసుపత్రి వైద్యులు తల్లీబిడ్డా యోగ క్షేమాలు చూస్తూ వచ్చారు. చిన్నారిని ముట్టుకోవలసిన వచ్చిన సమయంలో సురక్షితమైన పద్ధతులను అవలంబించేలా అవగాహన కల్పించారు. 17 రోజుల పాటు కంటికి రెప్పలా చూసుకోవడం వల్ల... ఆ బాబుకు కరోనా సోకలేదు. ఇద్దరికీ తరచుగా పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తూ వచ్చారు. రెండుసార్లు నిర్వహించిన ఫలితాల్లో ఇద్దరికీ నెగిటివ్ రావడంతో శనివారం ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు.

17 రోజులపాటు కరోనా పాజిటివ్ ఉన్న తల్లితో గడిపినా...చిన్నారి సురక్షితంగా బయటకు రావటంపై వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ఐసీఎంఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఏడాది చిన్నారిలో వైరస్‌ తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయమని చెబుతున్నారు.

ఇవీ చూడండి:కోలుకున్నా గానీ కళ్లల్లోనే కరోనా తిష్ఠ!

ABOUT THE AUTHOR

...view details