baby born without ears: ఏపీలోని విశాఖ జిల్లా పెదబయలు మండలం వనబంగి గ్రామానికి చెందిన మోహన్‌రావు, నాగమణి భార్యాభర్తలకు రెండు చెవులు లేకుండా మగబిడ్డ జన్మించాడు. ఈ నెల 18వ తేదీన నాగమణి పాడేరు జిల్లా ఆసుపత్రి ప్రసూతి విభాగంలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమె బిడ్డను ప్రసవించారు.
baby born without ears: చెవులు లేకుండా శిశువు జననం.. ఎక్కడంటే?? - పాడేరులో చెవులు లేకుండా శిశువు జననం
baby born without ears: మనం సహజంగా కాళ్లు లేకుండా లేదా చేతులు లేకుండా అప్పుడే పుట్టిన పిల్లలను చాలా మందినే చూసుంటాం. కానీ ఇక్కడ అరుదుగా చెవులు లేకుండా శిశువు జన్మించింది. ఈ సంఘటన ఏపీలోని విశాఖ జిల్లా పాడేరులో జరిగింది.
రెండు చెవులూ లేకుండా పుట్టిన మగబిడ్డ
చెవులు లేకుండా జన్మించిన శిశువును చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. శిశువు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన పరీక్షలు, చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకరప్రసాద్ అన్నారు.