అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవకుడిగా పనిచేసి.. అభివృద్ధి చేసినట్లు తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. నూతన సంవత్సరం వేళ ఆనందంగా గడపాల్సిన సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే బాధగా ఉందని ఆవేదన చెందారు. అమరావతి పరిధిలోని ఎర్రబాలెంలో ఆందోళన చేస్తున్న రైతులను.. సతీమణి భువనేశ్వరి తోడుగా కలిశారు. రైతుల ఆవేదన చూసే... ఈ ఏడాది వేడుకలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రాణ సమానంగా చూసుకున్న భూములను రైతులు రాజధాని కోసం త్యాగం చేయడాన్ని.. ప్రస్తుత అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
'ప్రజా సేవకుడిగా పనిచేశా.. అభివృద్ధి చేశా..!'
కొత్త ఏడాది రోజున ఏపీ రాజధాని గ్రామాల్లో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆనాడు భావితరాల భవిష్యత్తు కోసం భూములు అడిగితే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. నేడు అన్నదాతల ఆవేదన చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఎర్రబాలెంలో రైతులను కలిశారు.
babu
విజన్ - 2020...హైదరాబాద్ అభివృద్ధి
విజన్ - 2020 పేరుతో హైదరాబాద్ ఎలా ఉండాలో ఆనాడే చెప్పినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎలా ఉందో చూస్తే తన విజన్ ఏంటో తెలుస్తుందని చెప్పారు. మన పిల్లలు బాగుండాలని ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చానని అన్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా.. అధిగమించామని అన్నారు.