ఆంధ్రప్రదేశ్లోనికడప జిల్లా పులివెందులకు చెందిన రవీంద్రారెడ్డి సెప్టెంబర్ 2న పాదయాత్ర ప్రారంభించారు. తన గురువు సంకల్పం మేరకు ఉజ్జయిని జ్యోతిర్లింగం నుంచి శబరిమలకు యాత్ర తలపెట్టాడు. ఉజ్జయిని నుంచి మొదలుపెట్టి.. మార్గ మధ్యంలోని శక్తి పీఠాలు దర్శించుకుంటూ నేటికి 3,650 కిలోమీటర్లు నడిచారు. ఈనెల 13న కడప జిల్లా జమ్మలమడుగు చేరుకున్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపాడు. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం దర్శించుకుని అక్కడినుంచి కడపకు వచ్చినట్లు వివరించాడు. ఇక్కడి నుంచి శబరిమలకు వెళ్లనున్నాడు.
'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర - కడప భక్తుడి పాదయాత్ర వార్తలు
వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అయ్పప్ప భక్తుడు ఉజ్జయిని నుంచి శబరిమలకు పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏకంగా 3,650 కిలోమీటర్లు నడిచాడు. ప్రస్తుతం ఏపీలోని కడపకు చేరుకున్నాడు. అక్కడి నుంచి అయ్యప్ప క్షేత్రానికి పయనమవుతున్నాడు.

'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర
'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర
ఇవీ చదవండి: రెండో రోజు కన్నులపండువగా అతిరుద్ర మహాయాగం