ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్‌ను లైంగింకంగా వేధించిన వ్యవహారంలో కాంబాబుపై చర్యలు ఖాయమంటూ అయ్యన్న ట్వీట్ చేశారు. 'సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటూ.. కాంబాబుకు యూట్యూబ్ ఛానల్ యాంకర్ వాట్సాప్ మెసేజ్ చేసింది. ఇంటర్వ్యూ ఇస్తే.. నాకేం ఇస్తావు అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు.. ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం’ అని అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
ఇవీ చదవండి: