తెలంగాణ

telangana

ETV Bharat / city

AY.4.2: తెలంగాణలో ఏవై.4.2 వేరియంట్ విస్తరిస్తోందా?

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ.. ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. జన్యు పరిణామ క్రమాల్లో మార్పులు చేసుకుంటూ.. వైరస్​ను వ్యాప్తి చేస్తున్నాయి. అన్ని వేరియంట్లలోకెల్లా డెల్టా రకం.. ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత దాని నుంచి డెల్టా ప్లస్..​ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉత్పరివర్తనలు వెలుగుచూశాయి. ప్రస్తుతం ఏవై.4.2 వేరియంట్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

By

Published : Oct 28, 2021, 8:44 PM IST

ay4.2
ay4.2

భారతదేశంలో ఇప్పటివరకు 18 ఏవై.4.2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లో ఈ తరహా కేసులు వెలుగుచూశాయి. అయితే తెలంగాణలోనూ చాపకింద నీరులా ఏవై4.2 వేరియంట్​ విస్తరిస్తోందని.. కరోనా మూడో దశ తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. అయితే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఏవై.4.2 కేసులు తెలంగాణలో నమోదు కాలేదని అధికారులు ధ్రువీకరించారు.

"తెలంగాణలో జూన్​లో ఏవై.4.2 కరోనా వేరియంట్ కేసు ఒకటి నమోదైంది. కానీ అప్పటి నుంచి నేటి వరకు మళ్లీ ఆ వేరియంట్​ కేసులు నమోదు కాలేదు."

-- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

ఏవై.4.2. వేరియంట్​ అంటే..

ఏవై.4.2. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంక్రమిస్తుంది? అసలు వైరస్​ ఎలా మారుతుంది? వేరియంట్లు ఎలా పుట్టుకొస్తున్నాయి అని పరిశోధించడానికి.. ఇంగ్లాండ్​లోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయం బృందం ఏప్రిల్​లో ప్రయత్నించింది. అలా ఏవై.4.2 మూలాలు బయటపడ్డాయి. ముఖ్యంగా భారత్​కు వెళ్లివచ్చిన ప్రయాణికుల నమూనాలను పరిశోధకులు విశ్లేషించారు. అప్పుడే.. భారత్​లో కరోనా బీ.1.617 రకం (AY 4.2 coronavirus) వేరియంట్​ విజృంభించినట్లు వారికి తెలిసింది. బీ.1.617నే ఆ తర్వాత డబ్ల్యూహెచ్​ఓ.. డెల్టా వేరియంట్​గా నామకరణం చేసింది. భారత్​లో కరోనా సెకండ్​ వేవ్​కు డెల్టానే (Delta variant news) కారణం.

అయితే.. పరిశోధకులు సేకరించిన నమూనాలు డెల్టా వేరియంట్​తో సరిపోలలేదు. అంటే.. వైరస్​లో ఎన్నో ఉత్పరివర్తనాలు ఉన్నాయని, తాము పరిశోధించిన వాటిలో బీ.1.617కు చెందిన ఎన్నో ఉపరకాలున్నాయని తెలిసొచ్చింది.

ఈ డెల్టాలో(Delta variant news) తదనంతరం.. ఎన్నో జన్యుపర మార్పులు(Coronavirus news) చోటుచేసుకున్నాయని.. వాటిలో మరో రకమే ఇప్పుడు వెలుగుచూసిన 'ఏవై'(AY covid variant) అని గుర్తించారు. ఈ ఒక్క ఏవైలోనే (AY 4.2 coronavirus) 75 విభిన్న ఉపవంశాలు ఉన్నాయని, వీటిల్లో ఏవై.4 రకం యూకేను అతలాకుతలం చేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత కొద్దినెలలుగా.. అక్కడ వెలుగుచూస్తున్న కొత్త కేసుల్లో 63 శాతానికిపైగా వీటివే.

ఇదీ చూడండి:corona attack youth: యువతపై కరోనా పంజా.. 90 వేలకు పైగా బాధితులు

ABOUT THE AUTHOR

...view details