సీఏఏ విషయంలో రాజకీయ లబ్ధి పొందేందుకు బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ర్యాలీలు నిర్వహించడం సరైన చర్య కాదని భాజపా నగర ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ అన్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకించే రాజకీయ పార్టీలు పునరాలోచించుకోవాలని సూచించారు. ఈ బిల్లు ఏ మతానికి కులానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్లో సీఏఏ బిల్లుపై అవగాహనా ర్యాలీ - CAA Protest latest in Hyderabad
పౌరసత్వ బిల్లుపై సికింద్రాబాద్లో.. భాజపా నేతలు అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ రక్షణ భద్రత కోసమే పౌరసత్వ బిల్లును రూపొందించి అమలుపరచారని భాజపా నగర ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ తెలిపారు. దేశ భద్రత నిమిత్తమే పౌరసత్వ బిల్లును రూపొందించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్లో సీఏఏ బిల్లుపై అవగాహన ర్యాలీ
సికింద్రాబాద్ నుంచి సీతాఫల్ మండి నుంచి చిలకలగూడ వరకు... పౌరసత్వ బిల్లుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ రక్షణ భద్రత కోసమే పౌరసత్వ బిల్లును రూపొందించి అమలుపరచారని సతీష్ అన్నారు. దేశ భద్రత నిమిత్తమే ఇతర దేశాల పౌరసత్వం బిల్లును రూపొందించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.