క్యాన్సర్ మాస ఉత్సవాల్లో భాగంగా మహిళలకు క్యాన్సర్‌పై వివిధ రూపాల్లో నెల రోజులపాటు బియాండ్ పింక్ సంస్థతో పాటు సీఐఐ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 'ఐ పింక్.. ఐ కెన్' అనేది తమ నినాదమని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బియాండ్ పింక్ సంస్థ వ్యవస్థాపకురాలు తనూజ తెలిపారు.
క్యాన్సర్ మాస ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం - beyong pink organisation latest news
మహిళల్లో క్యాన్యర్‌పై వివిధ రూపాల్లో నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు బియాండ్ పింక్ వ్యవస్థాపకురాలు తనూజ హైదరాబాద్‌లో తెలిపారు. క్యాన్సర్ మాస ఉత్సవాల్లో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లక్ష మంది మహిళలకు వ్యాధిపై అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.
![క్యాన్సర్ మాస ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం Awareness program as part of Cancer Month celebrations by beyond pink](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9108491-943-9108491-1602225402339.jpg)
క్యాన్సర్ మాస ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం
మహిళలలో క్యాన్సర్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తనూజ అన్నారు. భారతదేశంలో క్యాన్సర్ సక్సెస్ రేటు 50 శాతం మాత్రమే ఉందని.. అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆమె అన్నారు. క్యాన్సర్ వ్యాధి బారినపడి కోలుకున్న వారితో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తనూజ వివరించారు.
ఇదీ చదవండి:జల వివాదంపై న్యాయసలహా కోరనున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ