తెలంగాణ

telangana

ETV Bharat / city

Autos in Hyderabad : 'ఇతర జిల్లాల్లో రిజిస్టరైన ఆటోలకు నగరంలో ప్రవేశం లేదు' - హైదరాబాద్​లో ఆటోల తనిఖీలు

Autos in Hyderabad : ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని హైదరాబాద్‌లో తిరిగే ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ఇతర జిల్లాల ఆటోలు నగరంలో కనిపిస్తే సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం హైదరాబాద్‌లో రిజిస్టరైన ఆటోలకే అనుమతి ఉన్నట్లు తెలిపారు.

Autos in Hyderabad
Autos in Hyderabad

By

Published : Feb 28, 2022, 12:22 PM IST

Autos in Hyderabad : ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని హైదరాబాద్​ నగరంలో తిరిగే ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి.. ఇతర జిల్లాల్లో రిజిస్టర్ అయిన ఆటోలకు జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మహానగర పరిధిలో రిజిస్టర్ అయిన ఆటోలకు మాత్రమే నగరంలో నడిపేందుకు అనుమతి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో రిజిస్టరైన ఆటోలకు నగరంలో ప్రవేశానికి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు.

Auto Services in Hyderabad : ఇప్పటికే ఆటో సంఘాలు, ఓలా, ఉబర్ సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు సూచనలు ఇచ్చారు. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ఆటోల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన వాహనాల కంటే ఇతర జిల్లాల వాహనాలే అధికంగా తిరుగుతున్నాయని పోలీసులు పరిశీలనలో వెల్లడైంది. వాహన కాలుష్యంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యల్లో భాగంగానే నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details