రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించిన బియ్యాన్ని అధికారులు మూడేళ్లుగా రాబట్టలేకపోయారు. 2019-20 యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ(FCI)కి సరఫరా చేసేందుకు మిల్లర్లకు ప్రభుత్వం ఇచ్చింది. వాటిలో 1.01 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 102 మంది మిల్లర్లు తిరిగి ఇవ్వలేదు.
మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించింది. మిల్లుల్లో సింహభాగం బియ్యం, ధాన్యం నిల్వలు లేవని వారు నిర్ధారించారు. అనంతరం బియ్యంపై 25 శాతం అపరాధ రుసుముతో వసూలు చేయాలని డిసెంబరు 7న పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులిచ్చింది.