Austrian delegation visits Assembly: తమ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు దృఢంగా అవుతాయని ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉల్ఫ్‌గాంగ్ సొబోట్కా అన్నారు. ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక రంగాలలో అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
రాష్ట్ర శాసనసభను ఆస్ట్రియా దేశ పార్లమెంటరీ డెలిగేషన్ టీం సభ్యులు, ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉల్ఫ్‌గాంగ్ సొబోట్కా, ఆస్ట్రియా ఫెడరల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ క్రిస్టినా స్వర్జ్ ఫచ్ నేతృత్వంలోని 17 మంది పార్లమెంట్ సభ్యులు సందర్శించారు. అసెంబ్లీకి వచ్చిన ఆస్ట్రియా బృందం సభ్యులు గ్యాలరీ ద్వారా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును వీక్షించారు. అనంతరం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో శాసనసభలోని కమిటీ హాల్లో సమావేశమయ్యారు.