తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ సర్పంచి సీటు.. చాలా కాస్ట్లీ గురూ - ap panchayath news

ఏపీలోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు సర్పంచి‌ పదవికి వేలం నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధర పలకింది ఈ హాట్​ సీట్​. ఏకంగా రూ.50.50 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు ఓ గ్రామస్థుడు.

ఈ సర్పంచి సీటు.. మహ కాస్ట్లీ గురూ
ఈ సర్పంచి సీటు.. మహ కాస్ట్లీ గురూ

By

Published : Feb 4, 2021, 7:19 PM IST

ఏపీ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎకగ్రీవాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంటే.. వీలైనన్నీ నామినేషన్లు వేయిస్తూ వైకాపా వ్యూహాలకు తెదేపా అడ్డుకట్ట వేస్తుంది. ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉన్నందున.. పలు గ్రామాల్లో వేలం పాటలు జరగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాల్లోని ఓ గ్రామ పంచాయతీకి జరిగిన వేలం అందరిని షాక్​కు గురిచేసింది. సర్పంచ్​ సీటు ఏకంగా రూ.50.50 లక్షలు పలికింది.

కలిగిరి మండలం తెల్లపాడు సర్పంచి‌ పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.50.50 లక్షలకు పదవిని ఓ గ్రామస్థుడు దక్కించుకున్నాడు. ఆ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి:పేద, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఏమి చేయదా?

ABOUT THE AUTHOR

...view details