తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR on Investments: ఏడేళ్లలో 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చాం: కేటీఆర్

రాష్ట్రానికి పెట్టుబడులు స్వాగతిస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడేళ్లల్లో 32 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడించారు. పెట్టుబడిదారులను జాగ్రత్తగా చూసుకుంటే వాళ్లే అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అవుతారని మంత్రి అన్నారు.

ktr
ktr

By

Published : Oct 22, 2021, 8:02 PM IST

గత ఏడేళ్లల్లో 32 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు ఆకర్షించామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 24 శాతం కంటే ఎక్కువ పెట్టుబడులు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుంచి వచ్చాయని చెప్పారు. హైదరాబాద్​లో పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా - పీఏఎఫ్‌ఐ 8వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు స్వాగతిస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

పెట్టుబడిదారులను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు... అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అవుతారని మంత్రి కేటీఆర్​ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, యువతకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రభుత్వం విధానాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని.. పెట్టుబడిదారులకు చాలా ప్రొఫెషనల్ పద్ధతిలో మార్గనిర్దేశం చేసే యువ నిపుణులను నియమించిందని వెల్లడించారు.

'రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. ఏడేళ్లలో 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. ఔత్సాహికులకు ప్రోత్సాహకాలిస్తున్నాం. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు కృషిచేస్తున్నాం.'

-కేటీఆర్, మంత్రి

యువ నిపుణులు ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ తెలంగాణ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారని.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్స్, ఫార్మాసూటికల్స్, బయోటెక్, మెడికల్ ఉపకరాలు, ఏరోస్పేస్, ఆహార శుద్ధి పరిశ్రమలు, టైక్స్‌టైల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ వాహనాల, జెమ్స్, జ్యూయలరీ, లాజిస్టిక్స్ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :TS Eamcet : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details