2018 నుంచి పీఈటీ ఫలితాలు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని పీఈటీ మహిళా అభ్యర్థులు ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ప్రగతిభవన్ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం - Female PET candidates protest in Hyderabad
పీఈటీ నియామకాలు వెంటనే చేపట్టకపోతే కారుణ్య మరణాలే శరణ్యమని పీఈటీ అభ్యర్థులు అన్నారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వీరిని పోలీసులు అడ్డుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ప్రగతిభవన్ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం
విజిల్ శబ్ధాలతో క్యాంప్ ఆఫీసు సమీపంలో నిరసన చేపట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుకు కౌంటర్ వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మహిళా అభ్యర్థులు ఆరోపించారు. ఈ నిరసనలో వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.
Last Updated : Dec 7, 2020, 2:23 PM IST