అసెంబ్లీ ముట్టడికి భాజపా ఎస్సీ మోర్చా నాయకుల యత్నం... అరెస్ట్ - అసెంబ్లీ ముట్టడికి భాజపా ఎస్సీ మోర్చా నాయకుల యత్నం... అరెస్ట్
భాజపా ఎస్సీ మోర్చా నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి... ఎలాంటి చర్యలు తీసుకోలేదని భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆందోళన నిర్వహించారు. భాజపా శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.
![అసెంబ్లీ ముట్టడికి భాజపా ఎస్సీ మోర్చా నాయకుల యత్నం... అరెస్ట్ Attempt by BJP SC Morcha leaders to invade the assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11136580-1004-11136580-1616570482048.jpg)
Attempt by BJP SC Morcha leaders to invade the assembly
అసెంబ్లీ ముట్టడికి భాజపా ఎస్సీ మోర్చా నాయకుల యత్నం... అరెస్ట్
ప్రభుత్వం ఎస్సీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.... భాజపా ఎస్సీ మోర్చా నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు భాజపా శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి... ఎలాంటి చర్యలు తీసుకోలేదని భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆరోపించారు.