ఏపీలోని విజయవాడలో దుండగుల చేతిలో గాయపడ్డ తెదేపా నేత పట్టాభిని ఈఎస్ఐ ఆసుపత్రికి పోలీసులు తరలించి... వైద్యపరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి విజయవాడలోని ఆయూశ్ హాస్పిటల్కి తరలించారు. రెండు రోజుల పాటు తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు. కొమ్మారెడ్డి పట్టాభిని మాజీ మంత్రి దేవినేని ఉమ పరామర్శించారు.
ఏపీ: ఈఎస్ఐ ఆసుపత్రి నుంచి ఆయుష్ ఆసుపత్రికి పట్టాభి... - పట్టాభి వార్తలు
దుండగుల చేతితో గాయపడ్డ తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి... వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు తమ పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
ఈఎస్ఐ ఆసుపత్రి నుంచి ఆయుష్ ఆసుపత్రికి పట్టాభి...
అసలేం జరిగిందంటే...
తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై.. ఏపీలోని విజయవాడలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కాలు, మోచేతికి గాయాలయ్యాయి. ఉదయం విజయవాడలోని నివాసం నుంచి.. పార్టీ కార్యాలయానికి బయల్దేరుతున్న సమయంలో... పట్టాభిపై దుండుగులు దాడి చేశారు. ఆయన కారును ధ్వంసం చేశారు. ఘటనలో పట్టాభి మొబైల్ కూడా ముక్కలైంది. దుండగులు రాడ్డులతో విచక్షణారహితంగా దాడి చేశారని పట్టాభి తెలిపారు.