తెలంగాణ

telangana

ETV Bharat / city

అపార్ట్​మెంట్ గొడవలు... బాలుడిపై విచక్షణారహితంగా దాడి..

సికింద్రాబాద్​ అల్వాల్​లోని ఓ అపార్ట్​మెంట్​లో బాలుడిపై హత్యాయత్నం చోటుచేసుకుంది. అదే అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటున్న క్రాంతి స్వరూప్​... జయంత్​ అనే బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఈ తతంగమంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని బాలుడి తండ్రి ఆరోపించారు.

అపార్ట్​మెంట్ గొడవలు... బాలుడిపై దాడి

By

Published : Nov 11, 2019, 11:27 AM IST

సికింద్రాబాద్​లోని అల్వాల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అల్వాల్​లోని సువర్ణ అపార్ట్​మెంట్​లో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ క్రాంతి స్వరూప్.... అదే అపార్ట్​మెంట్​లోని జయంత్ అనే బాలుడిపై హత్యాయత్నం చేశాడు. క్రాంతి స్వరూప్​ కుమారుడు, జయంత్ ఇద్దరు కలిసి బయట ఆడుకుంటున్న సమయంలో స్వరూప్ రాగానే అతని కొడుకు పైకి వెళ్లగా... జయంత్​ను క్రాంకి స్వరూప్ చితకబాదాడు... అతని కారుకు అడ్డంగా రావడం వల్ల అతన్ని విచక్షణారహితంగా కొట్టినట్లు జయంత్ తండ్రి తెలిపారు.

అపార్ట్​మెంట్​లోని సెల్లార్​లోకి ఈడ్చుకుంటూ వెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అక్కడ ఉన్న వాచ్​మెన్ చూసి ఆపడం వల్ల అతని ప్రాణాలు దక్కాయని వారు తెలిపారు. గొడవ జరిగిన 8వ తేదీన తాను ఇంట్లో లేనని జయంత్​ తండ్రి తెలిపారు. ఆ బాలుడిని క్రాంతి స్వరూప్​ కొట్టిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. క్రాంతి స్వరూప్​పై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని జయంత్ తండ్రి వాపోయాడు. నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదుచేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.

అపార్ట్​మెంట్ గొడవలు... బాలుడిపై దాడి

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్‌బండ్ ఎలా చేస్తారు?

ABOUT THE AUTHOR

...view details