నిష్పక్షపాత ఎన్నికలంటే జగన్‌కు భయమని ఆంధ్రప్రదేశ్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అనుకూల కమిషనర్ కోసం తాపత్రయపడటం అంటే ఎన్నికల ఫలితాల తారుమారు కోసం కాదా..?అని ప్రశ్నించారు. కోర్టును తప్పుడు సమాచారం ఇచ్చి రద్దు చేయించుకున్నంత మాత్రానా ప్రజాభిప్రాయం మారుతుందా అని నిలదీశారు. జగన్ రెడ్డికి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే ఎన్నికలకు వెళ్లెందుకు ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు.
తప్పుడు సమాచారంతో ఎన్నికలను అడ్డుకున్నారు: అచ్చెన్న
ఏపీ సీఎం జగన్‌పై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నిష్పక్షపాత ఎన్నికలంటే జగన్‌కు భయమన్నారు. ఎన్నికల షెడ్యూల్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును తెదేపా గౌరవిస్తుందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం తప్పుడు సమాచారంతో ఎన్నికలను అడ్డుకుందని ఆరోపించారు.
ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, వైకాపా ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి సింగిల్ జడ్జి కోర్టులో ఎన్నికల షెడ్యూల్ ను తాత్కాలికంగా అడ్డుకున్నారన్నారు. కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని అడిగిన జగన్... కరోనా లేనప్పుడు ఎన్నికలు ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు. నిజంగా కరోనా ఉంటే నెల్లూరులో అమ్మఓడి సభను వేలాది మందితో ఎందుకు నిర్వహించారని నిలదీశారు.
ఇదీ చదవండి:ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదు: హైకోర్టు