ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్, హాజరైనా పలకరించుకోని జగన్, చంద్రబాబు - తేనీటి విందు
AP Rajbhavan at Home స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు హాజరైనా ఒకరినొకరు పలుకరించుకోలేదు.
AP Rajbhavan at Home: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు కూడా ఎట్‌హోమ్‌లో పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, అశోక్‌బాబులతో.. కలిసి చంద్రబాబు తేనీటి విందుకు వెళ్లారు. ఐతే.. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు వేర్వేరు చోట్ల కూర్చున్నారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి దంపతులు కూర్చోగా పార్టీ నేతలతో చంద్రబాబు మరో చోట కూర్చున్నారు.