బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాఖల వారీగా పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండు రోజులుగా 26 పద్దులపై అసెంబ్లీ చర్చ జరిపి ఆమోదించింది. ఇవాళ మరో 12 శాఖలపై చర్చ జరగనుంది. సాగునీటి పారుదల, సాధారణ పరిపాలన, కార్మిక, ఉపాధి కల్పన, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రహదారులు, భవనాలు, విద్యుత్, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై శాసనసభ్యులు చర్చించనున్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు, వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు సంబంధించిన సవరణల బిల్లులపై కూడా చర్చ జరగనుంది. రేపటితో శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
నేటితో ముగియనున్న శాఖల వారీగా పద్దులపై చర్చ - telangana varthalu
శాసనసభలో పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండు రోజులుగా 26 పద్దులపై అసెంబ్లీ చర్చ జరిపి ఆమోదించగా... ఇవాళ మరో 12 శాఖలపై చర్చించనుంది. రేపటితో శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
నేటితో ముగియనున్న శాఖల వారీగా పద్దులపై చర్చ