తెలంగాణ

telangana

ETV Bharat / city

'చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ వెలుగులోకి తెచ్చారు' - అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ

అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సమావేశమైంది. కమిటీ ఛైర్మన్ జీవన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ విద్యుత్​ రంగంపై చర్చించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 16 వేల మెగావాట్లకు పెరిగిందని కమిటీ పేర్కొంది.

Assembly Public Sector Committee meeting on electricity department
Assembly Public Sector Committee meeting on electricity department

By

Published : Feb 3, 2021, 9:28 PM IST

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ పేర్కొంది. విద్యుత్ రంగంపై కమిటీ ఛైర్మన్ జీవన్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో ఇవాళ సమావేశం జరిగింది. చీకట్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ వెలుగులోకి తెచ్చారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి 16 వేల మెగావాట్లకు పెరిగిందన్నారు.

కొత్తగా 2లక్షల 68 వేల ట్రాన్స్ ఫార్మర్లు, 980 సబ్ స్టేషన్లు ఏర్పడ్డాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని... కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని జీవన్​రెడ్డి వివరించారు. విద్యుత్ రంగంపై వివిధ అంశాలు చర్చించిన కమిటీ.. ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఉన్న ఇల్లును కూల్చేశారు... నిలువ నీడ లేకుండా చేశారు

ABOUT THE AUTHOR

...view details