- ఏపీకి రూ.3 వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాలని కేంద్రం చెప్పింది: సీఎం
- మరో రూ.3 వేల కోట్లు వడ్డీ అంటున్నారు..: సీఎం కేసీఆర్
- నెలలోగా కట్టకపోతే చర్యలు తీసుకుంటామని అంటున్నారు: సీఎం
- ఏపీ నుంచి తెలంగాణకు రూ.17,820 కోట్లు రావాలి: సీఎం
- రూ.6 వేల కోట్లు మినహాయించుకుని మిగతాది ఇప్పించాలి: సీఎం
- నేను చెప్పిన విద్యుత్ లెక్కలు అబద్ధమైతే క్షణంలో రాజీనామా చేస్తా: సీఎం
శాసనసభ రేపటికి వాయిదా
14:06 September 12
14:06 September 12
- కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణపై పడ్డారు: సీఎం
- మనకు రావాల్సిన ఆర్ఈసీ రుణాలు ఆపేందుకు కుట్రలు: సీఎం
- శీతాకాల సమావేశాలు 20 రోజులు జరిపి కేంద్రాన్ని ఎండగడతాం: సీఎం
- సంస్కరణల పేరుతో కేంద్రం చేస్తున్న పనులు ప్రజలకు వివరిస్తాం: సీఎం
- ఉదయ్ పథకంలో చేరాక అనేక ఇబ్బందులు పెడుతున్నారు: సీఎం
- మన పింఛన్లు, రైతుబంధు గురించి కేంద్రమంత్రికి ఎందుకు?: సీఎం
- 10 శాతం విదేశీ బొగ్గు విధిగా కొనాలని కేంద్రం చెబుతోంది: సీఎం
- రూ.4 వేలకు వచ్చే సింగరేణి బొగ్గు వదిలి రూ.30 వేలు పెట్టి కొనాలా?: సీఎం
- విదేశీ బొగ్గు కొనకుంటే ఎన్టీపీసీ నుంచి సరఫరా ఉండదని బెదిరింపులు: సీఎం
14:06 September 12
- తెలంగాణ పథకాలు కావాలని మహారాష్ట్ర, కర్ణాటకలో డిమాండ్లు: సీఎం
- తమను తెలంగాణలో కలపాలని 50 గ్రామాలు తీర్మానం చేశాయి: సీఎం
- ఇది పోరాటాల గడ్డ.. ఇక్కడ పిట్ట బెదిరింపులు పనిచేయవు..: సీఎం
- ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపుతాం: సీఎం కేసీఆర్
14:06 September 12
- ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ స్పందన
- అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తాం: సీఎం
14:06 September 12
- రాష్ట్రానికి అన్యాయం చేస్తే కేంద్రాన్ని నిలదీద్దాం
- సంస్కరణల పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోం
- రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి
- సభను మరో 2 రోజులు జరపాలని కోరుతున్నాం
- కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా తీర్మానం చేయాలి
14:05 September 12
- విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని రేపు సభలో తీర్మానం: సీఎం
- కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని రేపు తీర్మానం: సీఎం
- గురుకులాల్లో భోజనం, నాణ్యతపై సమీక్షిస్తా: సీఎం కేసీఆర్
- వీఆర్ఏలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారు: సీఎం
- అర్హులైన వీఆర్ఏలకు స్కేల్ ఇచ్చి వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం: సీఎం
- వీఆర్ఏల మిగతా సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం కేసీఆర్
13:16 September 12
- శాసనసభ రేపటికి వాయిదా
12:14 September 12
- విద్యుదుత్పత్తిలో భాజపా ప్రభుత్వం చెప్పేవన్నీ గోల్మాల్ గోవిందం మాటలే..
- సౌరశక్తి పేరుతో విద్యుత్ వ్యవస్థను బడాబాబులకు అప్పగించేందుకు చర్యలు
- చెత్తను వాడుకుని కూడా అద్భుతంగా విద్యుత్ తయారుచేయవచ్చు
- మనవద్ద పుష్కలంగా చెత్త ఉంది.. దాంతో కావాల్సిన విద్యుత్ తయారుచేయవచ్చు
- కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ విధానం వల్ల అంధకారంలోకి పోతున్నాం
- బోర్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని బలవంతం చేస్తున్నారు
- మేకిన్ ఇండియా అనేది పూర్తి అబద్ధపు ప్రచారం
- మాంజా, జెండాలు, టపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయి
- విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం
- అనేక బిల్లులు తెచ్చారు.. జనం ఉద్యమించడంతో వెనక్కి తీసుకున్నారు..
- రైళ్లు, ఎల్ఐసీ సహా దేశంలోని అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారు
12:08 September 12
- అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
- భాజపాకు ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదు
- ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారు
- ఇప్పటివరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారు
- రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు
- భాజపా ప్రభుత్వం ఒక్క మంచిపని చేసిందా?
- సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏంటో చెబుతారు
- యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా?
- తెలంగాణలో 3 తోకలున్నాయి.. మమ్మల్ని పడగొడతామని అంటున్నారు..
- ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడింది
11:58 September 12
- జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లు
- తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,250 యూనిట్లు
- చిన్న దేశాల కంటే మనదేశంలోనే విద్యుత్ వినియోగం తక్కువ
- తలసరి విద్యుత్ వినియోగంలో మనదేశ ర్యాంకు 104
- మనదేశంలో అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారు
- ఇంకా అమ్మేందుకు వ్యవసాయ, విద్యుత్ రంగాలే మిగిలాయి
- సంస్కరణల పేరుతో వ్యవసాయ, విద్యుత్ రంగాలనూ అప్పగించేందుకు ఏర్పాట్లు
- రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయి
- కేంద్రం మాటలు వింటే సొంతపొలంలోనే రైతులు కూలీలుగా మారతారు
- ధాన్యం కొనాలని కోరితే కేంద్రమంత్రులు ఎగతాళి చేస్తున్నారు
- వ్యవసాయరంగంపై కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక లేదు
- నూకలు కూడా ఎగుమతి చేయకుండా నిషేధం విధించారు
- అసమర్థ విధానాలు, దూరదృష్టి లేకపోవడం వల్ల సాగు రంగం సమస్యల్లో ఉంది
11:42 September 12
- విద్యుత్ కేటాయింపుల్లో తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం
- కేటాయింపుల్లో భాగంగా లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకు అప్పగించారు
- సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారు
- కేంద్ర తొలి భేటీలోనే ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారు
- అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్సు తెచ్చారు
- శాసనసభకు ప్రతిపాదించకుండానే 7 మండలాలను అప్పగించారు
- సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా వారికే కేటాయించారు
- ప్రధాని మోదీని విమర్శించిన తొలి వ్యక్తిని నేనే
- దేశంలో ఫాసిస్టు ప్రధాని మోదీ అని విమర్శించాను
- తెలంగాణ బంద్‌కు కూడా పిలుపునిచ్చాను
- ఆనాడు తాను సీఎంగా ఎన్నుకోబడ్డాను.. అధికారికంగా బంద్‌కు ఎలా పిలుపునిస్తారని విమర్శించారు
- ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయాలని బంద్ పాటించాం
- విద్యుత్ ప్రాజెక్టు అయినా తెలంగాణకు కేటాయించాలని అనేక లేఖలు రాశా
- నేను రాసిన లేఖలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు
- కేంద్ర హయాంలో అంబేడ్కర్ స్ఫూర్తిని క్రమంగా కాలరాస్తున్నారు
11:41 September 12
- విద్యుత్తు చట్టంలో ఎక్కడా సబ్సీడీ తీసేయాలని చెప్పాలేదు: రఘునందన్‌రావు
- సెక్షన్ 65లో రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన వర్గాలకు సబ్సీడీలు: రఘునందన్‌రావు
11:41 September 12
- ఎమ్మార్పీఎస్ ఆందోళన అంశాన్ని లేవనెత్తిన భట్టి
- బీఏసీలో లేని విషయాలను ప్రస్తావించవద్దన్న సభాపతి
- విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం: భట్టి
- కేంద్రం తమకు నచ్చినట్లు చేస్తుంది, రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతుంది
- ఎక్కడో, ఎవరో ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనాలని కేంద్రం అనడం సమంజసం కాదు
- దేశ సంపదను వారి సొంత ఆస్తిలా కేంద్ర అమ్ముతుంది
- పీఎస్‌యూలను అమ్మకానికి పెట్టారు
- రాష్ట్రం అభివృద్ధి విద్యుత్తుతోనే సాధ్యం
- విద్యుత్తు పైన రాష్ట్రాలకు పూర్తి హాక్కు ఉండాలి
- వైఎస్ హయాంలోనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే ప్రణాళికలు రచించాం
- మెుత్తం లెక్కలు చూస్తే రైతులకు ఇచ్చింది అరకొరే
- పారిశ్రామికులకు మాత్రం లక్షల కోట్లు మాఫీలు, అదనపు ప్రయోజనాలు
- రాష్ట్రంలో మీ పార్టీ లేకపోతే సక్రమంగా పరిపాలన అందించరా?
- డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వరా?
- విభజన చట్టంలోని ఏ హామీని నెరవేర్చలేదు
- ఇటువంటి చట్టాలు.. రాజ్యాంగపైన దాడిగానే నేను భావిస్తున్నాను
- కేంద్ర ఆర్థిక మంత్రి కలెక్టర్‌ను అవమానిస్తారు
- రేషన్‌షాప్‌లో లెక్కలు మాట్లాడతారు
11:29 September 12
- రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనది
- దేశాల విద్యుత్ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుంది
- ఉమ్మడి ఏపీలో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు
- ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారు
- బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారు
- విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నాం
- పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు
- కేంద్ర తొలి కేబినెట్ భేటీలోనే తెలంగాణ గొంతు నులిమే ప్రయత్నం
11:23 September 12
- అభివృద్ధిని అనేక కొలమానాల ప్రకారం చూస్తారు: కేసీఆర్
- వ్యక్తిగత విద్యుత్తు వినియోగం ఎంత అనేది అభివృద్ధిలో భాగంగా చూస్తారు: కేసీఆర్
- ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం: కేసీఆర్
- అనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో చాలామంది రైతులు చనిపోయారు: కేసీఆర్
11:21 September 12
కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ అంతా ఎదురుచూస్తోంది: జీవన్ రెడ్డి
- కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ అంతా ఎదురుచూస్తోంది: జీవన్ రెడ్డి
- పంటల తెలంగాణను మంటల తెలంగాణగా భాజపా మార్చుతోంది: జీవన్ రెడ్డి
- తెలంగాణ మోడల్ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు : జీవన్ రెడ్డి
11:19 September 12
LIVE UPDATES: ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం: కేసీఆర్
కేంద్రం ప్రజల సమస్యలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు: బాల్క సుమన్
- కేంద్రం ప్రజల సమస్యలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు: బాల్క సుమన్
- కొందరు పారిశ్రామికవేత్తల లబ్ధి కోసమే భాజపా పనిచేస్తోంది: బాల్క సుమన్
- పారిశ్రామికవేత్తలకు లబ్ధిలో భాగంగానే విద్యుత్ సవరణ బిల్లు: బాల్క సుమన్
- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు: బాల్క సుమన్
- తెలంగాణ ప్రజల విద్యుత్ కష్టాల నుంచే తెరాస ఆవిర్భవించింది: బాల్క సుమన్
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో అద్భుత ప్రగతి సాధించాం: బాల్క సుమన్