Assembly blockade: శాసనసభ సమావేశాల చివరి రోజు ఉద్యోగులు, కుల సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లు నెరవేర్చాలని పెద్దఎత్తున అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వీఆర్ఏలపై తెలుగుతల్లి వంతెన వద్ద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో శాసనసభ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన వీఆర్ఏలపై లాఠీఛార్జ్:
సమస్యలు పరిష్కరించాలంటూ ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు, ఉపాధ్యాయులు, కులసంఘాలు శాసనసభ ముట్టడికి యత్నించాయి. అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నందున చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఉద్యోగులు, కులసంఘాలు వివిధ ప్రాంతాల నుంచి శాసనసభ ముట్టడికి యత్నించాయి. గతంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ పెంచాలని... ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు శాసనసభ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్క్ నుంచి వస్తున్న వీరిని తెలుగుతల్లి వంతెన కింద అడ్డుకున్న పోలీసులు... లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలు కాగా... ప్రభుత్వ తీరుపై అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేస్కేలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు పదవీ విరమణ ఇచ్చి, వారి పిల్లలకు ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ ముట్టడి: