ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం పెదవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి.. నిండు గర్బణి అయిన దేవరాజు ఈశ్వరమ్మను.. చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఫీడర్ అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. పెంటపాడు వద్దకు వచ్చేసరికి అటుగా వస్తున్న చింతపల్లి ఏఎస్పీ వి.విద్యాసాగర్ ఆ గర్భిణిని చూసి తన వాహనాన్ని ఆపారు.
చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ మానవత్వం... ప్రశంసల వర్షం
నిండు గర్భిణి.. నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి ఫీడర్ అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో అటుగా ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ అధికారి.. ఫీడర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి లేటవుతుందని భావించారు. స్వయంగా గర్భిణీని ఎత్తుకుని తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంతకూ ఆ ఐపీఎస్ అధికారి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే చదివేయండి మరి..!
గర్భిణీని తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన చింతపల్లి ఏఎస్పీ
పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్బిణీని చూసి చలించిపోయారు. ప్రసవానికి ఆలస్యమవుతుందని భావించి ఆమెను ఆయనే స్వయంగా ఎత్తుకుని తన వాహనంలో.. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గర్బిణి పట్ల చింతపల్లి ఏఎస్పీ వ్యవహరించిన తీరుపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ పరీక్ష చేయించుకున్న ఓవైసీ.. రిపోర్టులో ఏముందంటే..!