టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా అది వివాదాస్పదమే. తాజాగా ఈ దర్శకుడు మరో వివాదానికి తెర లేపారు. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసే ఆషు రెడ్డి.. తాజాగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ కోసం పొదుపుగా చిట్టిపొట్టి దుస్తులు ధరించింది. అసలే వర్మకు ఆడాళ్లన్నా, గ్లామర్ డోస్ పెంచి చూపించటమన్నా అమితమైన ప్రేమ. ఊరుకుంటారా... ఆమెను తన కెమెరా కళ్లతో బంధించేందుకు కింద కూర్చుని, మొబైల్ అటు ఇటు తిప్పి తిప్పి తెగ ఆరాట పడ్డారు.
ఆ కాళ్లని ఫొటో తీయంది వదలనన్నవి ఆర్జీవీ కళ్లు..! - ఆషురెడ్డి ఇంటర్వ్యూ
సోషల్ మీడియాలో పాపులర్ అయి బిగ్‌బాస్ ఎంట్రీ ఇచ్చింది అషురెడ్డి. సామాజిక మాధ్యమాల్లో తన అందాలతో.. మాటలతో కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకున్న ఈ భామ తాజాగా ఆర్జీవీతో ఓ విడియోలో కనిపించింది. ఆ విడియో వైరల్ అవుతోంది కానీ ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
![ఆ కాళ్లని ఫొటో తీయంది వదలనన్నవి ఆర్జీవీ కళ్లు..! ఆ కాళ్లని ఫొటో తీయంది వదలనన్నవి ఆర్జీవీ కళ్లు..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12819161-695-12819161-1629371324019.jpg)
ఆ సందర్భంలో తీసిన ఓ వీడియోని ఆషురెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోలో ఆషురెడ్డి కుర్చీపై కూర్చుని ఉండగా.. రామ్‌గోపాల్‌వర్మ కింది నుంచి ఫొటోలు తీశారు. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి నా ఫోన్ కెమెరా కళ్లు అంటూ.. కింద కూర్చుని మరీ ఆషు ఫొటోలు క్లిక్‌మనిపించారు. ఆర్జీవీ ఏంటి ఇలా చేయటమేంటి అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టగా.. ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాము కాదంటూనే అవునన్నట్టుగా.. నిజం కాకుంటే దేవుళ్లపై ఒట్టు కానీ దేవతలపై కాదు అంటూ సరదాగా పోస్ట్ చేశారు.