ఆశా వర్కర్లకు శుభవార్త.. నెలవారీ ప్రోత్సాహకాలు పెంపు - asha workers's incentives hike in telangana
10:47 January 06
ఆశా వర్కర్లకు నెలవారీ ప్రోత్సాహకాలు పెంపు
తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్‌లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ.7,500 నుంచి రూ,9,750కి పెరగనున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి పెంచిన ఇన్సెంటివ్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
- ఇదీ చదవండి :జీతాలు పెంచాలని ఆశా వర్కర్ల ఆవేదన