Asha workers protest: కొవిడ్ విధుల్లో చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో.. కలెక్టరెేట్ వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కరోనాతో చనిపోయిన బాధితులకు పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ వద్దకు చొచ్చుకువచ్చిన ఆశావర్కర్లను పోలీసులు నిలువరించారు. దీంతో ఆశావర్కర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. ఓ ఆశా కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు..
కాకినాడలో నిర్వహించే నిరసన దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లను.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కాట్రేనికోన, ముమ్మడివరం, ఐ పోలవరం, తాళ్లరేవు మండల పరిధుల్లో వాహనాలను తనిఖీలు చేసి పోలీసులు ఆపేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న దీక్షకు పోలీసులు అడ్డుచెప్పడం పట్ల ఆశావర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా తమని అడ్డుకోవడం సమంజసం కాదంటూ పోలీసులతో ఆశాలు వాదనకు దిగారు.
కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తల ఆందోళన ఇవీ చదవండి:ktr letter to central minister : 'సింగరేణి జోలికొస్తే కార్మికుల సెగ దిల్లీని తాకుతుంది'
'ప్రజలను దారి మళ్లించేందుకే.. కేసీఆర్ రాజ్యాంగం ప్రస్తావన తెచ్చారు'