కరోనా సమయంలో సేవలందించిన ఆశా వర్కర్లను విధులకు రావద్దని చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో మెడికల్ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి చేసిన సేవలను అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
విధుల్లో కొనసాగించాలని ఆశా వర్కర్ల ఆందోళన - తెలంగాణ వార్తలు
కరోనా సమయంలో కొత్తగా తీసుకున్న ఆశా వర్కర్లను తిరిగి విధుల్లో కొనసాగించాలని వారు నిరసన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలను అందించామని గుర్తుచేశారు.
విధుల్లో కొనసాగించాలని ఆశా వర్కర్ల ఆందోళన
నగర జనాభాకు సరిపడా ఆశావర్కర్లు లేనప్పటికీ.. ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న వారిని విధులకు హాజరు కావద్దని చెప్పడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రతి 2 వేల జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉండాలి. ఈ లెక్కన హైదరాబాద్లో 2,250 మంది ఉండాలన్నారు. ప్రస్తుతం 1,045 మంది మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'చేతులు ఎత్తడం ద్వారానే మేయర్ ఎన్నిక'