తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR Davos Tour: '20 ఏళ్లలో భారత్​కు కేటీఆర్​ ప్రధాని అయినా ఆశ్చర్యంలేదు..'

KTR Davos Tour: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ చేస్తున్న కృషి పట్ల అమెరికాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ప్రశంసలు కురిపించారు. మరో 20 ఏళ్లలో కేటీఆర్.. భారత్​కు ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదంటూ ఆశా జడేజా మోత్వాని ట్వీట్ చేశారు.

Asha Jadeja Motwani said KTR might become a Prime minister of India in 20 years
Asha Jadeja Motwani said KTR might become a Prime minister of India in 20 years

By

Published : May 25, 2022, 8:27 AM IST

KTR Davos Tour: రాబోయే ఇరవయ్యేళ్లలో మంత్రి కేటీఆర్‌ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అమెరికాలోని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్‌ బృందం తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో అద్భుతమైన కృషి చేస్తోందన్నారు.

తెలంగాణ బృందం పెట్టుబడులకు ఆహ్వానిస్తున్న తీరు.... తనకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులను గుర్తుచేస్తుందని తెలిపారు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతో కేటీఆర్ బృందం తిరిగివెళ్లేలా ఉన్నారని ఆశా జడేజా ట్వీట్ లో పేర్కొన్నారు..తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలతలను దావోస్‌ వేదికపై వివరిస్తూ దూసుకెళ్తోందన్నారు. మంగళవారం రోజు ఆమె తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయనతో దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు.

స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక చర్చాగోష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్- మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్​తో పాటు ఎన్ఈసీ జపాన్ సీఈఓ తకాయుకి మోరిటా, ఉషాహిది- దక్షిణాఫ్రికా ఈడీ ఎంజీ నికోల్ ఎడ్జ్ టెక్ సీఈఓ కోయెన్ వాన్ ఓస్ట్రోమ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details