Asani Cyclone effect on Krishna District : అసని తుపాను ప్రభావంతో ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా.. అరటి, బొప్పాయి, నిమ్మ, మొక్కజొన్న, పసుపు తదితర ఉద్యాన,వాణిజ్య పంటలపై తుపాను ప్రభావం చూపింది. మూడు రోజులువీచినగాలులకు అరటి, బొప్పాయి తోటలు చాలా చోట్ల నేలకొరిగాయి. తోట్లవల్లూరు, అవనిగడ్డ, ఘంటసాల, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, మోపిదేవి మండలాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది.
Asani Cyclone : అసని తుపాను.. అసలేం మిగల్లేదంటున్న అన్నదాతలు - Asani Cyclone effect on Krishna farmers
Asani Cyclone effect on Krishna District : అసని తుపాను ఏపీలోని కృష్ణా జిల్లా ఉద్యాన రైతులను దెబ్బతీసింది. అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. వర్షాల కన్నా గాలుల వల్లే ఎక్కువ నష్టం జరిగింది. పంట నష్టంపై ఉద్యాన శాఖ అధికారులు అంచనాలు సేకరిస్తున్నా వివరాల నమోదులో నిబంధనలపై రైతులు ఆవేదన చెందుతున్నారు.
Asani Cyclone effect on AP
చాగంటిపాడు, భధ్రరాజుపాలెం, వల్లూరివారిపాలెం గ్రామాల్లో అరటి రైతులు దెబ్బతిన్న పంటను చూసి ఆవేదన చెందుతున్నారు. పడిపోయిన తోటలు శుభ్రం చేసేందుకే ఎకరాకు 10 నుంచి 20 వేల రూపాయలు అదనంగా ఖర్చవుతాయని వాపోతున్నారు. అరటి, బొప్పాయితోపాటు.. మొక్కజొన్న, పసుపు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడి కూడా రాదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన పంట నష్టంపై అధికారులు అంచనా వేయిస్తున్నారు.